హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ చిత్రపటంతో ప్రమాణ స్వీకారం

నెల్లూరు 6వ డివిజన్ కార్పొరేటర్‌గా విజయం సాధించిన జనసేన అభ్యర్థి బత్తల శ్రీకాంత్ తనదైన శైలిలో ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని చేతబట్టి ప్రమాణం చేసి, ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ పట్ల, నాయకుడి పట్ల తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేశారు. శ్రీకాంత్ ప్రమాణ స్వీకారం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.