హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ సిబ్బందికి రెండో విడత శిక్షణ

కోనసీమ: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆత్రేయపురంలో మహాత్మా గాంధీ జూనియర్ కళాశాలలో పోలింగ్ అధికారులకు సోమవారం రెండో విడత శిక్షణ నిర్వహించారు. ఎంపీడీవో పీవీఆర్‌కే రాజు అధ్యక్షతన మాస్టర్ ట్రైనర్లు ఎస్‌వీఎస్ఎన్ ప్రసాద్, పీ.వాసుకి శిక్షణ ఇచ్చారు. పోలింగ్ విధానాలు, బ్యాలెట్ పత్రాల నిర్వహణ, ఎన్నికల నిబంధనలు, పోలింగ్ అనంతర ప్రక్రియలపై అవగాహన కల్పించారు.