హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి'

KNR: ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. సోమవారం కరీంనగర్ ఐడీఓసీలో నిర్వహించిన ప్రజావాణిలో 183 అర్జీలు స్వీకరించారు. వీటిలో కరీంనగర్ నగరపాలక సంస్థకు 54, గృహనిర్మాణ శాఖకు 47 వచ్చాయి.