హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోతంగి సర్పంచ్ బరిలో మట్టం రాధమ్మ

ASR: డుంబ్రిగూడ మండల పోతంగి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మట్టం రాధమ్మ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ నాయకులు మట్టం శంకర్, కమ్మిడి విజయదశమితో కలిసి నామినేషన్ కేంద్రానికి వెళ్లి ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా రాధమ్మ మాట్లాడుతూ.. సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.