AKP: నక్కపల్లి పట్టణానికి చెందిన జిల్లా కాంగ్రెస్ నాయకుడు మేడేటి శంకర్ దంపతులు సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. సోమవారం హోంమంత్రి వంగలపూడి అనిత నివాసం వద్ద ఆమె సమక్షంలో పార్టీలో చేరారు. అనిత పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై టీడీపీలో చేరినట్లు శంకర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు


