హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల రోజుల్లో వేతనంతో కూడిన సెలవు..!

ATP: జిల్లాలో నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని దుకాణాలు, వాణిజ్య సంస్థల ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ అవకాశం కల్పించినట్లు జిల్లా ఉప కార్మిక కమిషనర్ లక్ష్మీ నరసయ్య తెలిపారు. యాజమాన్యాలు ఉత్తర్వులు పాటించి ఉద్యోగులకు సహకరించాలని సూచించారు.