హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు పైడమ్మ అమ్మ జాతరకు దుకాణాల వేలం

కృష్ణా: పెడనలో శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు డిసెంబర్ 23 నుంచి జనవరి 2 వరకు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు ఆలయ పరిసరాల్లోని ఖాళీ స్థలంలో దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి ఉన్న వ్యాపారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.