హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వదాన్య ప్రతిభా పరీక్ష బ్రోచర్లు విడుదల

ATP: ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు వదాన్య ప్రతిభా పరీక్ష సువర్ణావకాశమని MLA అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. డిసెంబర్ 27న నిర్వహించనున్న 'వదాన్య ప్రతిభా పరీక్ష-2026' బ్రోచర్లను ఆయన విడుదల చేశారు. పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు రూ.5 లక్షల విలువైన నగదు బహుమతులు అందజేయనున్నారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.