హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు ఆత్మహత్యాయత్నం.. పరామర్శించిన జోగు రామన్న

ADB: భోరాజ్ మండలంలోని హత్తిఘాట్ భూ వివాదం నేపథ్యంలో కలెక్టరేట్ ప్రజావాణిలో పురుగుల మందు తాగిన మాండగడ రైతు దేవన్నను మాజీ మంత్రి జోగు రామన్న రిమ్స్‌లో సోమవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న రామన్న, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక BRS నాయకులు ప్రభాకర్, రవి, రమేష్ తదితరులు ఉన్నారు.