హైదరాబాద్: 28°C
వార్తలు

డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులపై సమగ్ర విచారణ

నిర్మల్: ఖానాపూర్ పట్టణ శివారులోని డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులపై సమగ్ర విచారణ జరిపించాలని న్యూడెమోక్రసీ, బహుజన కమ్యూనిస్టు పార్టీ, డబుల్ బెడ్రూం సాధన కమిటీ నాయకులు నిరసనకు దిగారు. అనర్హులను తొలగించి నిజమైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.