NLR: బోగోలు మండలంలోని కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. స్వామి అమ్మవార్లకు అభిషేకం, సహస్ర దీపాలంకరణ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు కొండ బిట్రగుంటలో కార్తీక దీపోత్సవం పూజలు


