హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్

PLD: నవంబర్ 26న జరగనున్న నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్థానిక ఏ.ఎం. రెడ్డి కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా పరిశీలించారు. భద్రత, మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.