హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

52వ డివిజన్‌కు కొత్త కార్పొరేటర్

CTR: నగరపాలక సంస్థ 52వ డివిజన్ కార్పొరేటర్‌గా పి.ఎస్. చంద్రశేఖర్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని చంద్రశేఖర్ పేర్కొన్నారు.