హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్తీక పౌర్ణమికి బాపట్ల తీర ప్రాంతాల్లో ఏర్పాట్లు

బాపట్ల: నవంబర్ 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల రాకకు సూర్యలంకతో పాటు నిజాంపట్నం, పాండురంగాపురం, ఓడరేవు, మోటుపల్లి తీర ప్రాంతాల్లో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ.. సముద్రంలోకి కొంతమేర వరకు మాత్రమే వెళ్లేందుకు అనుమతులు కల్పించడం ద్వారా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది.