అన్నమయ్య: చిట్వేల్ మండల పరిషత్ కార్యాలయంలో నవంబర్ 24న ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కోసం పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేంద్రం పనిచేస్తుంది. సిబ్బంది ఎన్నికల డ్యూటీ ఉత్తర్వుల కాపీ, ఓటరు గుర్తింపు కార్డుతో హాజరై పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
చిట్వేలిలో రేపు పోస్టల్ బ్యాలెట్ కేంద్రం


