NDL: శ్రీశైలం నల్లమల అడవుల్లో నివసిస్తున్న చెంచు గిరిజన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని నాయకులు కోరారు. గొర్రెలు, మేకల పెంపకానికి వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 20 మంది చెంచులు ఐటీడీఏ కార్యాలయానికి వెళ్లగా అధికారులు అందుబాటులో లేక నిరాశ చెందారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 70 చెంచు కుటుంబాలకు ఉపాధి కల్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'గొర్రెలు, మేకల రుణాలు మంజూరు చేయాలి'


