హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

కృష్ణా: రైలు నుంచి జారిపడి తీవ్రంగా గాయపడిన గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆదివారం రామవరప్పాడు- నిడమానూరు రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని రైలు నుంచి సుమారు 35 ఏళ్ల వ్యక్తి జారిపడినట్లు తెలిపారు. తీవ్రగాయాలైన అతడిని 108 వాహనంలో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం అతను మృతి చెందినట్లు తెలియజేశారు.