హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఎలక్ట్రిక్ పరికరాలు దగ్ధం

NRML: కడెం మండలంలోని మాసాయిపేట గ్రామానికి చెందిన నాగిళ్ల రాజన్న ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజన్న ఇంట్లో సోమవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు గురై మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ పరికరాలతో పాటు పలు ఇంట్లోని సామాగ్రి దగ్ధమైంది. తాను రూ.2 లక్షల వరకు నష్టపోయారని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు.