SKLM: టెక్కలి మండలం రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. కార్తీక సోమవారం సందర్భంగా దర్శనానికి వచ్చిన భక్తులకు అత్యవసర వైద్య సహాయం అందించేందుకు ఈ శిబిరం ఏర్పాటు చేశారు. పీహెచ్సీ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో, వైద్యాధికారి జయశ్రీ పర్యవేక్షణలో భక్తులకు వైద్య సేవలు అందించారు.
ఆంధ్రప్రదేశ్
రావివలసలో ఉచిత వైద్య శిబిరం


