PLD: నరసరావుపేట 35వ వార్డు సీపీఐ అభ్యర్థి కాసా రాంబాబును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ.. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పట్టణ అభివృద్ధి, పేదల ఇళ్ల స్థలాలు, త్రాగునీటి సమస్యల పరిష్కారంలో సీపీఐ పాత్ర ఎంతో కీలకమని నేతలు బైరాపట్నం రామకృష్ణ, రాంబాబు గుర్తు చేశారు. ఈ నెల 26న జరిగే ఎన్నికల్లో కంకి కొడవలి గుర్తుకు ఓటేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సీపీఐ అభ్యర్థి విస్తృత ఇంటింటి ప్రచారం


