హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్న డైమండ్ బాబు

GNTR: ఫిరంగిపురం మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల కార్యక్రమంలో సోమవారం వైసీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్న నేపథ్యంలో ఆయన నామినేషన్ కార్యక్రమాలను పరిశీలించారు.