హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డివైడర్‌ను ఢీకొని ఆటో బోల్తా

మార్కాపురం జిల్లా చౌడవరం గ్రామానికి చెందిన ఐదుగురు నెల్లూరు జిల్లాలోని ఘటిక సిద్ధేశ్వర స్వామి ఆలయానికి సోమవారం ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మారంరెడ్డిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొని ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో మాల్యాద్రికి కాలు విరగగా, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.