హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చేజర్లలో ముస్లిం మత పెద్ద మృతి

NLR: చేజర్ల మండలం ఆదురుపల్లికి చెందిన ముస్లిం మత పెద్ద గౌస్ బాషా సోమవారం ఉదయం స్వగృహంలో కన్నుమూశారు. ముస్లిం పిల్లల విద్యాభివృద్ధికి, మసీదుల నిర్మాణానికి ఆయన విశేష కృషి చేశారు. మత గురువుగా పలు ధార్మిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన మృతి పట్ల ముస్లిం సమాజం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.