ELR: ఉంగుటూరు భీమేశ్వర స్వామి దేవస్థానం ఆలయంలో సోమవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో జరిగే రీతిలో ఈ వ్రతాలు నిర్వహించారు. భక్తులకు దేవస్థానం ఛైర్మన్ నారాయణం హనుమంతరావు తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉంగుటూరులో సామూహిక వ్రతాలు..!


