హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు భోజనం.. పాఠశాలకు కానుకలు

CTR: విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్వర్గీయ నారప్పరాజు వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు సురేష్ బాబు విద్యార్థులకు శుభదిన భోజనం ఏర్పాటు చేశారు. పాఠశాలకు ప్రథమ చికిత్స కిట్లు, ఫ్యాన్లు, విద్యుత్ బడిగంటతో పాటు ఆరోగ్య కేంద్రానికి బీపీ ఆపరేటర్‌ను వితరణగా అందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం వెంకటరాజు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.