హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం

నంద్యాల పట్టణంలో సోమవారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పర్యటించారు. పట్టణానికి చేరుకున్న ఆయనకు స్థానిక వైసీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. మంచాల మనోజ్ కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు కార్తీక మాస వనమహోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం వారు మాజీ ఎమ్మెల్యేను పూలమాలలతో ఘనంగా సన్మానించారు.