హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కొనసాగించి, సొంత గనులు కేటాయించాలని CITU మద్దిలపాలెం జోన్ కార్యదర్శి పి.వెంకటరావు డిమాండ్ చేశారు. సోమవారం GVMC గాంధీ విగ్రహం వద్ద ప్లాంట్ పరిరక్షణ కోసం చేపట్టిన 2,060వ రోజు నిరాహార దీక్షలో మాట్లాడారు. తొలగించిన 6 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు.