హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగర పంచాయతీ వైస్ ఛైర్మన్‌గా వాసు

W.G: ఆకివీడు నగర పంచాయతీ నూతన పాలకవర్గం సోమవారం ప్రమాణస్వీకారం చేసింది. అనంతరం ఛైర్మన్ నీలోఫర్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో వైస్ ఛైర్మన్‌గా తోట వాసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాసును వార్డు సభ్యులు కారంపూడి సుమంత్ ప్రతిపాదించగా కిమిడి అరుణకుమారి,సంద కృష్ణవేణిలు బలపరిచారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కమిషనర్ కృష్ణమోహన్ ప్రకటించారు.