హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేయర్‌గా రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం

అనంతపురం నూతన మేయర్‌గా బీసీ రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు వైసీపీ కార్యాలయంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, వై.విశ్వేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.