హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నిక నిబంధనలు తప్పక పాటించాలి

SKLM: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సోమవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణంలో పలాస రూరల్ 16 పంచాయితీల పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులుతో డీఎస్పీ రమణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామాల్లో ఎలాంటి వర్గ విభేదాలు, ఘర్షణలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని కోరారు.