హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్లలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

బాపట్ల: మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 1వ వార్డులో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు, కూటమి ఛైర్మన్ అభ్యర్థి ఇస్కా సునీల్ కుమార్, జనసేన సమన్వయకర్త నామన వెంకటశివన్నారాయణ పర్యటించారు. కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ వెళ్లి కూటమి మేనిఫెస్టో, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.