హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో డీఎస్పీల సదస్సుకు రానున్న PM

తిరుపతిలో డిసెంబర్ 4 నుంచి 6 వరకు జరగనున్న డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్ల సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సదస్సు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు అధికారులకు ఆదేశించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో శాంతిభద్రతలు, పోలీసు వ్యవస్థలో సంస్కరణలు, భద్రతా అంశాలపై చర్చించనున్నారు.