హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామలో వైస్ ఛైర్మన్ పదవిపై రగడ

NTR: నందిగామలో వైస్ ఛైర్మన్ పదవి విషయంలో కూటమిలో అసంతృప్తి నెలకొంది. 15వ వార్డు కౌన్సిలర్ ఇమామ్‌కు పదవి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారంటూ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు గాంధీ సెంటర్లో ధర్నా నిర్వహించారు. TDP డౌన్ డౌన్, కోగంటి బాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వైస్ ఛైర్మన్ పదవి బీజేపీకి కేటాయించడాన్ని టీడీపీ మైనార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.