KRNL: పెద్దకడబూరులో సోమవారం విద్యుత్ తీగ తెగిపడటంతో గ్రామానికి చెందిన మంచోది అంబేద్కర్‌కు చెందిన గడ్డివాము దగ్ధమైంది. ఈ ఘటనలో రూ.70 వేలు విలువ చేసే గడ్డివాము పూర్తిగా కాలిపోవడంతో నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పశుగ్రాసం కళ్లముందే కాలిపోవడంతో రైతు అంబేద్కర్ బోరున విలపించారు. సంబంధిత అధికారులు స్పందించి నష్టపరిహారం అందించాలని బాధిత రైతు కోరారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ తీగ తెగి గడ్డివాము దగ్ధం


