PLD: జిల్లాలోని చిలకలూరిపేట, గురజాల, మాచర్ల పరిధిలోని 12 మండలాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ చివరి రోజు ప్రశాంతంగా సాగుతోంది. ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆదేశాలతో కేంద్రాల వద్ద డ్రోన్ నిఘా, 100 మీటర్ల బారికేడ్లు ఏర్పాటు చేసి అభ్యర్థితో పాటు ఇద్దరినే అనుమతిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
డ్రోన్ నిఘా నడుమ ప్రశాంతంగా నామినేషన్లు


