NLR: చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. నెల్లూరు నుంచి చిత్తూరు వెళ్తున్న RTC బస్సు, ముందు వెళ్తున్న లారీ సడెన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
లారీ-బస్సు ఢీ.. పలువురికి గాయాలు


