CTR: కార్తీకమాసం సోమవారం సందర్భంగా పుంగనూరు పట్టణం పుష్కరిణి సమీపానగల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. అర్చకులు రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో పరమేశ్వరుని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక అలంకారంలో కాశీ విశ్వేశ్వరుని దర్శనం


