హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

VSP: షీలానగర్‌లోని STBL ప్రాంగణం వెనుక రైల్వే ట్రాక్ పక్కన ఉన్న కాలువలో 35 నుంచి 45 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని పురుషుడి మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమైంది. మృతుడి ఎడమ చేతిపై ‘అమ్మ’ అనే పచ్చబొట్టు, కుడి చేతి మణికట్టుకు నల్లటి దారం ఉన్నట్లు గాజువాక పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు ఎస్సై జి. హరిచందన (9492148734)ను సంప్రదించాలన్నారు.