హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయచోటి ఆర్టీసీ ప్రమాదంపై మంత్రి మండిపల్లి ఆరా

అన్నమయ్య: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి ఆర్టీసీ డిపోలో జరిగిన బస్సు ప్రమాదంపై ఆరా తీశారు. ఈ ప్రమాదంలో ఔట్‌సోర్సింగ్ కార్మికురాలు భారతి మృతి చెందడం బాధాకరమని పేర్కొంటూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన మరో ఇద్దరికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.