హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీజలధీశ్వర స్వామి సేవలో ఎమ్మెల్యే దంపతులు

కృష్ణా: ఘంటసాల శ్రీ బాల పార్వతీ సమేత జగదీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా హైదరాబాద్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దంపతులు దర్శించుకున్నారు. అర్చకులు చావాలి కృష్ణ కిషోర్ ప్రత్యేక పూజలు, అభిషేకాలు స్వామి వారికి నిర్వహించారు . దేవాలయ లాంచనాలతో శేష వస్త్రం స్వామివారి జ్ఞాపికనందించి సత్కరించారు.