కడప నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా 16వ డివిజన్ కార్పొరేటర్ మంసూర్ అలీ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన పేరును 12వ డివిజన్ కార్పొరేటర్ ఆంజనేయులు ప్రతిపాదించగా, 15వ డివిజన్ కార్పొరేటర్ తుంగ రమణయ్య బలపరిచారు. ఇతరులెవరూ పోటీలో లేకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం డిప్యూటీ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
కడప డిప్యూటీ మేయర్‌గా మంసూర్ అలీ ఖాన్ ఏకగ్రీవం


