గుంటూరు: వట్టిచెరుకూరు మండలం లేమల్లెపాడు గ్రామ సమీపంలో గుంటూరు వైపు వెల్తున్న కారు గ్రామంలోని గొడ్ల చెరువులోకి దూసుకెళ్లింది. స్ధానికుల సమాచారం ప్రకారం.. కారు గ్రామ సమీపంలోని చెరువు వద్దకు చేరుకోగానే ఎడమ చక్రం ఊడిపోవటంతో ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్న వ్యక్తికి ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
లేమల్లపాడు చెరువులోకి దూసుకెళ్లిన కారు


