హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'హామీలను నెరవేర్చడంలో కూటమి విఫలం'

పల్నాడు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, పూర్తిగా విఫలమైందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఈ వైఫల్యాలను ప్రజలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని, జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక పోలీసులను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారన్నారు.