MDK: కొనాయిపల్లి దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ.. మనోహరాబాద్ మండలం కొనాయిపల్లిలో దళిత సంఘాలు నిరసన తెలిపాయి. గ్రామంలోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం సమర్పించాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఇందులో నాయకులు నిరంజన్ దాస్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'దాడి నిందితులను అరెస్ట్ చేయాలి'


