హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొనుగోలు కేంద్రం కోసం రైతుల నిరసన

MDK: అల్లాదుర్గం ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటులో జాప్యంపై అన్నదాతలు ఆగ్రహించారు. ఇవాళ మండల పరిషత్ ఆఫీసులో జరిగిన ప్రజావాణి వద్దకు చేరుకున్న రైతులు కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. ఇప్పటివరకు కేంద్రం తెరవకపోవడంపై అధికారుల తీరును ఎండగట్టారు. తక్షణమే స్పందించి కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.