హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాణేమ్మను ఓటు వేసి గెలిపించాలి: మాజీ ఎమ్మెల్యే

అన్నమయ్య: ఉర్లగట్టుపోడు సర్పంచ్ అభ్యర్థి పలిగల రాణేమ్మకు కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు కోరారు. ఏగువుపల్లిలో ఆమెతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి, వార్డు సభ్యుల అభ్యర్థులను కూడా గెలిపించాలని గ్రామస్తులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.