హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కూల్ బస్సులకు రూ. 1.52 లక్షలు జరిమానా

NLR: మర్రిపాడు మండలం డీసీపల్లి టోల్ ప్లాజా వద్ద ఎంవీఐ రాములు తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను తరలిస్తున్న రెండు స్కూల్ బస్సులను గుర్తించారు. బద్వేల్ నుంచి నెల్లూరుకు పెళ్లి కార్యక్రమానికి వెళ్తున్న బస్సులకు మొత్తం రూ.1.52 లక్షల జరిమానా విధించారు. స్కూల్ బస్సులను విద్యార్థుల రవాణాకే ఉపయోగించాలని హెచ్చరించారు.