హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

ASF: కాగజ్ నగర్ పట్టణంలో రేపు నిర్వహించనున్న ఉచిత కంటి వైద్య శిబిరంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కంటి శుక్లాలు ఉన్నవారు, కంటి చూపు మందగించిన వారికి ఉచితంగా పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ఓటరు, ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ 2 ఫోటోలు తీసుకొని రావాలని సూచించారు.