హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరులో వైసీపీ ‘ప్రజాద్రోహ దినం’ నిరసన

KDP: ప్రొద్దుటూరులో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘ప్రజాద్రోహ దినం’ నిర్వహించారు. ప్రజల ప్రత్యక్ష ఓటుతో ఎన్నిక కాకుండా ఛైర్మన్, 52 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని నిరసిస్తూ దొరసానిపల్లెలోని ఆయన నివాసం వద్ద మౌనంగా ఆందోళన చేపట్టారు. పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.