KKD: రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నవరంలో జరగనున్న గిరి ప్రదక్షిణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ఈవో నల్లం సూర్య చక్రధరరావు, ఈఈ రామకృష్ణ, ఏఈలు, ఇతర ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రహదారులు, మౌలిక సదుపాయాలు తదితర ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కార్తీక పౌర్ణమి గిరి ప్రదక్షిణకు ముమ్మర ఏర్పాట్లు


